kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ (karimnagar) జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆమె, తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎకరాకు కనీసం రూ.50వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
Read also: Rain Alert: మళ్లీ వానలు..బాంబు పేల్చిన వాతావరణ శాఖ
kavitha: కవిత డిమాండ్.. రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి
kavitha: ప్రస్తుతం ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ విధంగానూ సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు. మొలకెత్తిన పంటలు, బూజు పట్టిన ధాన్యం, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కవిత సూచించారు. రైతుల జీవితాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: