తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాని దుస్థితిలో ఉన్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ప్రజలకు స్పష్టమైన మార్పు తీసుకురాలేదని ఆమె విమర్శించారు. “ఇదేనా బంగారు తెలంగాణ?” అని ప్రశ్నిస్తూ, నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సదుపాయాలు లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులకు సరైన చికిత్స అందకపోవడం, ఐసీయూలో ఒక్క బెడ్‌పై ఇద్దరు రోగులను ఉంచడం వంటి అంశాలు రాష్ట్ర ఆరోగ్య రంగం దుస్థితిని చూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
Read also: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. భక్తుల ఆగ్రహం
Kavitha: ఇదేనా బంగారు తెలంగాణ?: కవిత
రైతు సమస్యలపై కళ్లుమూసుకున్నారని
కవిత మాట్లాడుతూ, నల్గొండ జిల్లాకు 12 ఏళ్లుగా కృష్ణా జలాలు సరిగా అందకపోవడం ప్రజలకు అన్యాయమని అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రాజెక్టుల వద్ద నిర్వాసితుల కష్టాలు చూసి మనసు కలచివేస్తోందని చెప్పారు. రైతులు పండించిన పత్తిలో తేమ శాతం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. “ప్రస్తుత పాలకులు రైతు సమస్యలపై కళ్లుమూసుకున్నారని” ఆమె ఆరోపించారు.
కవిత తీవ్రంగా స్పందించారు
నల్గొండ పర్యటన సందర్భంగా, జాగృతి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై కవిత తీవ్రంగా స్పందించారు. “నా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు? నాకు ఎవరితోనూ విభేదాలు లేవు” అని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టైన జాగృతి కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. “జాగృతి ప్రజా హక్కుల కోసం పోరాడే సంస్థ. మాతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు” అని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: