📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

Latest news: Kavitha: కొత్త పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే

Author Icon By Saritha
Updated: November 4, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కవిత కొత్త పార్టీ ఏర్పాటు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు(Kavitha) చేస్తున్నారనే ప్రచారాన్ని ఖండించారు. మార్చి లేదా ఏప్రిల్‌లో కొత్త రాజకీయ పార్టీ స్థాపనకు సిద్ధమవుతున్నారని వచ్చిన వార్తలను తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమం ఏప్రిల్ 13న ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, జాగృతిని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, ఈ నాలుగు నెలలు ప్రజల మధ్యలోనే ఉండి, వారి సమస్యలను దగ్గరగా తెలుసుకుంటాను. కొత్త, పాత కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తున్నారు అని వివరించారు.

Read also: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

Kavitha: కొత్త పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే

పత్తి రైతుల సమస్యలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత, పత్తి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్(BRS) మూడు పార్టీలు కూడా రైతు సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపుతున్నాయని(Kavitha) విమర్శించారు. ఇటీవల మొంథా తుపాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగి రైతులు నష్టపోతున్నారని, కేంద్రం దీనిపై సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పత్తిలో తేమ శాతాన్ని 20–25 శాతం వరకు అనుమతించాలని కవిత కేంద్ర మంత్రిని కోరనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల సమస్యలపై జాగృతి మద్దతు

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిర్వీర్యం అవుతున్నదని ఆమె విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజు సమస్యలపై చేపట్టిన బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలుపుతున్నదని ఆమె తెలిపారు.

రాహుల్ గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలుకాలేదని ఆమె విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో రైతులు ఉంటేనే ప్రభుత్వానికి మన కష్టాలు కనబడేవి అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

cotton farmers Farmer Declaration fee reimbursement kavitha Latest News in Telugu New Party Rumours telangana jagruthi Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.