📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

kavitha: బీఆర్ఎస్ ను దక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయి.. కవిత

Author Icon By Digital
Updated: September 3, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వర్షాకాలంలో రాజకీయ వేడినిపుట్టిస్తున్నాయి. మంగళవారం కవితను బీఆర్ఎస్(kavitha) నుంచి సస్పెండ్ చేయడంతో బుధవారం కవిత ప్రెస్మీట్ ను ఏర్పాటు చేశారు. తన పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని.. రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హరీశ్ రావు(Harish Rao), సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్(BRS) ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ రూ 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోశ్ అంటకాగుతున్నారని దుయ్యబట్టిరు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోనుళ్లొ చేస్తూ వారి బాధలను పంచుకుంటున్నారని కవిత అన్నారు.

కేసీఆర్ లేని పార్టీ ఎందుకు? కవిత

బీఆర్ఎస్ ఉంటే ఎంత .. లేకపోతే ఎంత అని తను ఎప్పుడూ అనలేదని కవిత(kavitha) చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని కవిత చెప్పారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ప్రశ్నించారు. ఆరడుగుల బుల్లెట్టే (హరీశ్ రావు) తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు.

వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీశ్ దగ్గరుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని కవిత సూచించారు. ‘పార్టీలో ఏం జరుగుతోంది చూడండి నాన్న.. బీఆర్ఎస్ నేను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి’ అని తన తండ్రిని కేసీఆర్ను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు. కవిత నెక్స్ట్ భవిష్యత్తు ఏమిటనే చర్చలు జరుగుతున్నాయి. ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో తన పార్టీ గురించి తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-kavitha-resignation-from-mlc-post-beware-of-ramanna-kavithas-sensational-comments/telangana/540624/

brs harish rao Kalvakuntla Kavitha kavitha kavitha new party Kavitha press meet KCR ktr Santosh Rao Telangana news Telangana Political Developments Telangana politics Today telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.