📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Letter : కెసిఆర్ కు కవిత లేఖ

Author Icon By Sudheer
Updated: May 23, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ (Kavitha Letter) ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)కు రాసిన ఏడు పేజీల లేఖలో కవిత తొలినాళ్లలో పార్టీ సాధించిన విజయాలు, ప్రజల మద్దతు, కేసీఆర్ నాయకత్వ విశిష్టతలను కొనియాడుతూ మొదటి మూడు పేజీల్లో సానుకూల అంశాలను వివరించారు. అయితే తరువాతి నాలుగు పేజీల్లో మాత్రం ఆమె తన అసంతృప్తిని చాటుతూ తండ్రికి స్పష్టమైన ప్రశ్నలు సంధించారు.

అందరినీ కలవండి డాడీ

“ఎంపీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు… ఎంతోమంది మీను కలవలేక బాధపడుతున్నారు” అంటూ కవిత తన బాధను వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల మనసులోని భావాలను పట్టుకుని, ప్లీనరీల ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆమె సూచించారు. “మహాసభలే అయినా జరపండి, అందరినీ కలవండి” అంటూ కోరడం, పార్టీ అంతర్గత పరిణామాలపై ఆందోళనను చూపిస్తుంది. ఈ సూచనలు కేవలం రాజకీయ వ్యూహంగా కాకుండా, తనదైన కుటుంబ అనుబంధంతో కూడిన అవగాహనగా కనిపిస్తున్నాయి.

లేఖ లో ప్రధాన అంశం

కవిత లేఖలోని ప్రధాన పాయింట్ ..ఎల్కతుర్తి సభలో కేసీఆర్, బీజేపీపై తీవ్రంగా మాట్లాడకుండా మౌనంగా ఉండటం. ఈ మౌనం భవిష్యత్తులో బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారానికి కారణమవుతుందనేది ఆమె అభిప్రాయం. “మీరు బీజేపీపై ఇంకాస్త గట్టిగా మాట్లాడాల్సింది కాదు డాడీ? నాకు బాధగా అనిపించింది” అంటూ లేఖలో వ్యాఖ్యానించడం, ఆమె రాజకీయ దృష్టిని స్పష్టంగా వెల్లడిస్తోంది. ఈ లేఖతో కల్వకుంట్ల కుటుంబంలో కవిత తనదైన స్వరం వినిపిస్తూ, బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రజల దృష్టిని ఆకర్షించారు.

Read Also : Kiran Abbavaram : తండ్రయిన కిరణ్ అబ్బవరం

Google News in Telugu kavitha kavitha letter KCR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.