కరీంనగర్ (Karimnagar) జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరోసారి తన మధుర గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఆమె ఆలపించిన స్ఫూర్తిదాయక గీతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే ఈ గీతం, వారికి ప్రోత్సాహాన్ని అందించేలా ఉంది.
Read Also: TG: అంగన్‌వాడీ పిల్లలకు ఈ స్నాక్స్ కూడా ఇస్తారు
ఇది మొదటిసారి కాదు కలెక్టర్ (Collector) పమేలా సత్పతి గతంలోనూ సామాజిక సమస్యలపై సందేశాత్మక గీతాలను ఆలపించి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘దివ్యదృష్టి’ యూట్యూబ్ ఛానల్‌లో ఆమె పాడిన ఈ గీతాన్ని విడుదల చేశారు. ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత… సంకల్పం ముందు వైకల్యమెంత…’ అనే పాదాలతో కూడిన ఈ పాట, దివ్యాంగుల జీవితాల్లో స్ఫూర్తిని నింపుతోంది.
ఈ గీతం 2009లో విడుదలైన ‘నింగీ నేల నాదే’ చిత్రంలోని పాట. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటలోని బలమైన సాహిత్యం, దివ్యాంగులు తమ పరిమితులను అధిగమించి ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చేలా ఉందని కలెక్టర్ భావించి దీనిని ఎంచుకున్నారు.
ఈ పాటలోని బలమైన సాహిత్యం,
ఈ పాట పాడాలనే ఆలోచన ఆమెకు రావడానికి కారణం ఒక కార్యక్రమంలో సింధుశ్రీ అద్భుతంగా పాడడం. ఆమె స్వరం కలెక్టర్‌ను ఆకట్టుకోవడంతో, మూడు రోజుల క్రితం తన చాంబర్‌లోనే ఈ పాటను రికార్డ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అంధుల పాఠశాల సంగీత ఉపాధ్యాయురాలు సరళ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కేబీ శర్మ ఆధ్వర్యంలో ఈ గీతాన్ని ప్రొఫెషనల్‌గా రికార్డ్ చేశారు. పాట విడుదలతో వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. వేలాది మంది నెటిజన్లు ఈ గీతాన్ని షేర్ చేస్తూ, కలెక్టర్ గాన ప్రతిభను, సింధుశ్రీ స్వరాన్ని ప్రశంసిస్తున్నారు.
భ్రూణ హత్యలను నిరోధించేందుకు ‘చిన్నిపిచ్చుక’ వంటి సందేశాత్మక గీతాలు పాడిన అనుభవం కలిగిన పమేలా సత్పతి, ఉన్నతాధికారిణిగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు సామాజిక అంశాలపై కళాత్మక ప్రతిభను వినియోగిస్తుండడం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆమెలోని మానవీయతను ప్రతిబింబిస్తోందని అనేక మంది ఆమెను ప్రశంసిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: