Karimnagar Accident: కరీంనగర్ జిల్లాలో సోమవారం ఒక తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో స్కూల్ బస్సు మరియు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య
వివరాల్లోకి వెళితే
ఈ ప్రమాదంలో వీణవంక మండలం మామిడాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థులు గణేశ్ (22), సందీప్ రెడ్డి (20) అక్కడికక్కడే మృతి(Dead) చెందారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఇండికేటర్ వేయకుండా, సిగ్నల్ ఇవ్వకుండా బస్సు డ్రైవర్ సడెన్గా టర్న్ తీసుకోవడంతో బైక్ బస్సును ఢీకొట్టిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గణేశ్ తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటనతో మామిడాలపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: