📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: Kalvakuntla Kavitha: వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తా: కవిత

Author Icon By Anusha
Updated: November 5, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం చేపట్టిన “జాగృతి జనం బాట” కార్యక్రమంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామస్థాయిలో అభివృద్ధి పరిస్థితులను పరిశీలించడం లక్ష్యంగా ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

Read Also: Hyderabad: చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ అత్యాచారం

ఆదిలాబాద్‌లో కవిత పర్యటన

ప్రస్తుతం ఆమె ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏర్పాటుతో పాటుగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే నియోజకవర్గం పేరు కూడా ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో జనం బాట కార్యక్రమం 2వ రోజు అనగా మంగళవారం నాడు కవిత మీడియాతో మాట్లాడారు.

ఆలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయని.. వీటన్నింటిని చూసిన తర్వాత తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాని ప్రకటించారు. ఆదిలాబాద్ సమస్యల పరిష్కారం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఈ ప్రాంతం ఇంకా వెనకబడే ఉందని

ఈ ప్రాంతం ఇంకా వెనకబడే ఉందని.. ఇక్కడ ఇంకా చెప్పుకోదగ్గ పరిశ్రమలు రాలేదని.. అభివృద్ధికి ఈ ప్రాంతం చాలా దూరంగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది తనకు సూచించారని ఆమె తెలిపారు.

ఆదిలాబాద్ (Adilabad) సమస్యలపై జాగృతిగా గట్టిగా పోరాడుతుందని.. చట్టసభల్లో కూడా జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడతామని కవిత తెలిపారు.అలానే పార్టీ ఏర్పాటు అంశంపై కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం తన దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు.

Kalvakuntla Kavitha

బీజేపీ పార్టీ పై విమర్శలు

అయితే కొత్త పార్టీ ఏర్పాటు అంశంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కవిత. వచ్చే సంవత్సరం అనగా 2026, ఫిబ్రవరి 13 తర్వాత జనం బాట ముగుస్తుందని.. ఆతర్వాతే పార్టీ ఏర్పాటు అంశంపై నిర్ణయం తీసుకుంటానని కవిత తెలిపారు.

బీజేపీ పార్టీ (BJP party) రాముడి పేరుతో ఓట్లు అడుతుంది. కానీ దేవుడి గుడి కోసం మాత్రం పనిచేయదని విమర్శించారు కవిత. జిల్లాలోని జైనథ్ ఆలయానికి ఎంపీ నిధుల నుంచి రూ. 20 లక్షలు కేటాయించాలి అని ఆమె డిమాండ్ చేశారు.

జిల్లా సెంట్రల్ లైబ్రరీని సందర్శించి

ఆ తర్వాత రిమ్స్ హాస్పిటల్‌లో రోగులతో మాట్లాడిన కవిత వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా సెంట్రల్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని లైబ్రరీలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

అనంతరం జిల్లా కేంద్రంలో మేధావులు, విద్యావేత్తలతో కవిత సమావేశమయ్యారు. జాగృతిలో చేరేందుకు బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు కూడా తమతో టచ్ లో ఉన్నారని.. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 4 నెలల కార్చాచరణ రూపొందించామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ADILABAD assembly elections Breaking News Kalvakuntla Kavitha latest news telangana jagruthi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.