📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kalvakuntla Kavitha: ‘వెలుగుమట్ల’ బాధితులను కలిసిన కవిత

Author Icon By Saritha
Updated: March 9, 2026 • 3:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Kalvakuntla Kavitha: Kavitha meets the victims of ‘Velugumatla’

Kalvakuntla Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ‌ పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె చలించిపోయారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

Read Also: Medak Municipal Council: ఛైర్పర్సన్ భర్త కు అధికార హోదా … ?

మీ వెంటే ఉండి పోరాడతాను.. కవిత

బాధితుల సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కవిత ఆరోపించారు. “నేను ఇక్కడికి టూరిస్ట్‌లా రాలేదు. మీ సమస్యకు ఒక పరిష్కారం దొరికే వరకు మీ వెంటే ఉండి పోరాడతాను” అని బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత మంత్రులు తక్షణమే వెలుగుమట్లకు వచ్చి, బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. “ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు” పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లపైకి బుల్డోజర్లను పంపడం అన్యాయమని ఆమె మండిపడ్డారు.

గతంలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఇళ్లు కూల్చడానికి ప్రయత్నాలు చేశారని కవిత అన్నారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేశారో అక్కడే తిరిగి స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కవిత స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Khammam House Demolition Khammam Visit mlc kavitha telangana jagruthi Velugumatla Eviction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.