📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kalvakuntla Kavitha: రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

Author Icon By Saritha
Updated: March 11, 2026 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kalvakuntla Kavitha: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (TG) రాష్ట్రాలు భౌగోళికంగా వేరైనప్పటికీ.. రాజకీయాల పరంగా మాత్రం కాదనే చెప్పాలి. ఒక రాష్ట్ర రాజకీయాలపై మరో రాష్ట్రం రాజకీయం అంతో ఇంతో ప్రభావితం చూపుతూనే ఉంటుంది. తమ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలపై, పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. వారు ఏమనుుకుంటున్నారనే ఆసక్తి ప్రజలలో ఉండటం సహజమే. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులకు సంబంధించి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

Read Also: MLA Disqualification: దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

Kalvakuntla Kavitha: Kavitha defined political leaders with a single word

నాయకులపై ఒక్క మాటలో కవితా అభిప్రాయం

యాంకర్ అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల కవిత కేసీఆర్ – గొప్ప ఉద్యమ నాయకుడు, రేవంత్ రెడ్డి – ఫ్లాప్ సీఎం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి – గుడ్ లీడర్, వైఎస్ జగన్ – గట్టి లీడర్, వైఎస్ షర్మిల – ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నా, బండి సంజయ్ – అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు .. ధర్మపురి అరవింద్- అబద్ధానికి ప్రతిరూపం, ఈటెల రాజేందర్ – గట్టి ఫైటర్, నారా చంద్రబాబు నాయుడు – ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యేవరకూ కొట్లాడారు గ్రేట్, నారా లోకేష్ – నేర్చుకుంటున్నాడు నా లెక్కన, పవన్ కళ్యాణ్ – నాన్ సీరియస్ పర్సన్, కల్వకుంట్ల కవిత – ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ.. అంటూ బదులిచ్చారు కవిత. 

అయితే బీఆర్ఎస్ పార్టీకి, టీడీపీకి మధ్య సంబంధాలు అంతంతమాత్రమే అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుపై బీఆర్ఎస్ నాయకులు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం నారా చంద్రబాబు నాయుడు పోరాడిన తీరును మెచ్చుకోవటం విశేషం. అలాగే వైఎస్ జగన్‌ను గట్టి లీడర్ అంటూ అభినందించారు కవిత.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandrababu Naidu Kalvakuntla Kavitha interview KCR Pawan Kalyan Revanth Reddy Telangana politics YS Jagan ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.