Kallur: పేదలందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కల్లూరు మండలంలోని లింగాల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మునిగంటి లీలావతి, శ్రీనుల గృహాలను ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Breaking news: Terror Plot in Hyderabad: భాగ్యనగరంలో ఉగ్ర కుట్ర భగ్నం?
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజదేవి, మున్సిపల్ చైర్మన్ ధారవత్ మోహన్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి, పసుమర్తి చంద్రరావు, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్రావు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: