📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kaleshwaram: కాళేశ్వరం అక్రమాలపై ఇడి ఫోకస్..

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అవినీతి అధికారులపై విచారణకు నిర్ణయం

హైదరాబాద్: బిఆర్ఎస్ సర్కారు(BRS Govt) హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు (Project)లో కీలక హోదాలో పనిచేసి ఆ తరువాత అవినీతి ఆరోపణలపై ఎసిబి కేసుల్లో ఇరుక్కుని అరెస్టయిన అధికారులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ)(ED) దృష్టి సారించింది. కాళేశ్వరంలో ఇఎన్సిగా పనిచేసి ఎసిబికి పట్టుబడ్డ వారు ఇద్దరయితే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వుండి దొరికిపోయిన వారు మరొకరు. వీరి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులు వుండడం, కోట్లాది రూపాయల నగదు, బంగారు నగలు పట్టుబడడం ఎసిబి అధికారులను సైతం ఆశ్చర్య ప రిచింది. నీటి పారుదల శాఖ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఇఎన్సీలతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి, ఇతర స్థాయి అధికారులు పట్టుబడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Kaleshwaram: కాళేశ్వరం అక్రమాలపై ఇడి ఫోకస్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి

ఎసిబికి పట్టుబడ్డ వారిలో భూక్యా హిరిరాం నాయక్, మురళీధర్ రావులు ఇఎన్సి హోదా కలిగిన వారు కాగా నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదా కలిగిన అధికారి. ఇందులో మురళీధర్ రావు పదవీ విరమణ చేసినా 13 ఏళ్లుగా అక్కడే కొనసాగు తున్నారు. మిగతా ఇద్దరు సర్వీసులో వుండి ఎసిబికి దొరికిపోయారు. భూక్యా హరిరాం నాయక్ భార్య సైతం నీటి పారుదల శాఖలోనే ఇఎన్సిగా వుండడం, ఆమెపైనా అవినీతి ఆరోపణలు వుండడంతో ఎసిబి దీనిపైనా వివరాలు సేకరించింది. వీరితో పాటు మరికొందరు నీటి పారుదల శాఖ అ ధికారులు కూడా ఎసిబికి దొరికిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తుండడం, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప నిచేసిన పలువురు ఉన్నతాధికారులు ఎసిబి కేసుల్లో పట్టుబడి, వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగివుండడంతో ఈ మొత్తం వ్యవహారంపై పూ ర్తిస్థాయి విచారణకు ఈడీ రంగం సిద్ధం చేసింది.

ఈడీ అధికారులు ప్రభుత్వానికి లేఖ!

కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి ఎసిబికి పట్టుబడ్డ అవినీతి అధికారుల వివరాలను తమకు అందజే యాలని ఈడీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. దీని తరువాత ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు మరో కేసు నమోదు చే సి విచారణ చేసే వీలుంది. ఈడీకి అందిన సమాచారం మేరకు తాజాగా అరెస్టయిన ఇఎన్సీ మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు ఓ కంపెనీ నెలకొల్పగా అందులో నీటి పారుదల శాఖలో అక్రమార్కులు భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనిపై పక్కా సమాచారం సేకరించిన ఈడీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసి అవినీతి కేసులో అరెస్టయిన వారి వివరాలను తీసుకుని, వారిపై చర్యలకు ఏర్పాట్లు చేస్తున్నారు .

కాళేశ్వరం దేనికి ప్రసిద్ధి చెందింది?
పుష్కరాలకు ప్రసిద్ధి చెందిన కాళేశ్వరం - ది హిందూ
కాళేశ్వరం ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన గౌరవనీయమైన తీర్థయాత్ర అయిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా ప్రసిద్ధి చెందింది.
కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమా వైఫల్యమా?
తెలంగాణ రాష్ట్ర జల సంక్షోభానికి ఒక మైలురాయిగా ఒకప్పుడు చెప్పబడిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) ఇప్పుడు వివాదంలో, నిర్మాణాత్మక ఇబ్బందుల్లో చిక్కుకుంది

Read hindi news: hindi.vaartha.com

Read Also : Kamal Meets Rajini : రజినీకాంత్ ను కలిసిన కమల్ హాసన్

#telugu News Corruption case ED investigation EDI Probe Irrigation Scam kaleshwaram project KCR government Money Laundering political scandal Telangana news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.