📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kaleshwaram: కన్సల్టెన్సీ ఏజన్సీల సౌజన్యంతో కాళేశ్వరం పునరుద్ధరణ చర్యలు

Author Icon By Sharanya
Updated: July 21, 2025 • 10:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లోని మూడు బ్యారేజిలను నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఔట్సోర్సింగ్ కన్సల్టెన్సీ ఏజన్సీల సౌజన్యంతో డ్రాయింగ్లు రూపొందించడానికి సమ్మతించినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (Central Designs Organization) డిజైన్ల రూపకల్పనలో నోడల్ ఏజన్సీ ఐనప్పటికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల పునరుద్ధరణ అవసరమైన డిజైన్ల తయారీకి నైపుణ్యం తమకు లేదని ఇన్నాళ్ళు అశక్తత వ్యక్తం చేస్తూ వచ్చింది.

ఔట్సోర్సింగ్ కన్సల్టెన్సీ ఏజన్సీ నియామకం

ఎన్ఎఎస్ఏ తుది నివేదిక వచ్చి రెండునెలలు గడిచినా రెట్రోఫిటింగ్ తమకు కొత్త అంటూ సిడివో ఉదాసీనంగా ఉండటంతో నీటిపారుదలశాఖ నుంచే కాకుండా ప్రభుత్వం నుంచి విమర్శలు ఎదుర్కొంది. సిడివో డిజైన్ల విషయంలో మెత్తబడింది. బ్యారేజిల పునరుద్దరణకు ఔట్సోర్సింగ్ కన్సల్టెన్సీ ఏజన్సీ నియామకం చేసుకొని డిజైన్స్ ఇస్తామంటూ ముందుకు వచ్చినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఔట్సోర్సింగ్ కన్సెల్టెన్సీ ఏజన్సీ (Outsourcing Consultancy Agency) నియామకం కోసం మూడు కోట్లలో బడ్జెట్ను కూడా రూపొందించి ప్రభుత్వంకు నివేదించినట్లు తెలిసింది. కాళేశ్వరం (Kaleswaram)కు చెందిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిల పునర్దురణ చేయాలంటే గత పక్షం రోజుల క్రితం సిడివో అధికారులకు మెమో ఇవ్వడంతో ఇన్నాళ్ళు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులలో చలనం వచ్చింది. బరాజ్లలోని లోపాలపై అధ్యయనం జరిపి వాటి పునరుద్ధరణకి డిజైన్లు తయారు చేయాలని 2023 ఆక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నీటిపారుదల శాఖ 9 మెమెలు జారీచేశారు. సిఇ సిడివో స్పందించకపోగా ఆపరేషన్ అండ్ మేనేజేమెంట్ వైఫల్యంకు తాము ఏవిధంగా జవాబుదారులగా మారుతామని ప్రత్యుత్తరం ఇవ్వడంతో నీటిపారుదల శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమారు ఇరువైకి పైగా రాసిన లేఖలో నీటిపారుదలశాఖ డిజైన్స్ విషయంలో చేసిన అభ్యర్ధనలు దానికి సిడివో ఇచ్చిన స్పందనలు పొందుపరిచి బ్యారేజి పునరుద్ధరణకు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన రెండు నెల తరువాత కూడా స్పందించపోవడాన్ని తీవ్రంగా ఇరిగేషన్ శాఖ తప్పుపట్టింది.

సిఇ సిడివోనే కాళేశ్వరం బ్యారేజిల నిర్మాణానికి బాధ్యత

డిజైన్ల విషయంలో నోడల్ ఏజన్సీగా అత్యున్నత బాడీగా వ్యవహరించే సిఇ సిడివోనే కాళేశ్వరం బ్యారేజిల నిర్మాణానికి డిజైన్ల విషయంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాళేశ్వరం (Kaleswaram) డిజైన్లు వారు ఇచ్చినా ఇవ్వకపోయినా డిజైన్స్ తయారించింది సిఇ సిడివో అని మాత్రమే ఫైళ్ళలో ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడం, అన్నారం బుంగలు పడటంతో ఇలాంటి ప్రతికూల పరిస్థితి ఏర్పడటంతో సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకి శాఖలో సర్వోన్నత విభాగం సిఇసిడివో అవసరమైనప్పుడు బాధ్యత తీసుకోకుండా చేతులు దులుపుకోవడం విమర్శలకుదారిని తీసింది. బ్యారేజి పునరుద్ధరణకి డిజైన్ల తయారీని నిపుణులు అత్యుత్తమ సంస్థలు పరిశోధన విభాగాలకు అప్పగించాలని అని సిడివో కోరడం కూడా నీటిపారుదల శాఖకు ఇబ్బంది కలిగించింది. జాతీయ ఆనకట్టల భద్రత ప్రాదికార సంస్థ ఎన్డీఎస్ఏ సిఫారసుల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల పునరుద్ధరణకి డిజైన్లను తయారు చేసే బాధ్యతకు సిఇ సిడివో చేపట్టాల్సి ఉంది. వారు డిజైన్లు రూపొందించాక సిడబ్ల్యు సి. ఎన్డీఎస్ఏ ఇతర పరిశోధక సంస్థల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. సిడివో ముందుకు రావడానికి సంకోచించడంతో అవసరమైతే సంబంధిత అంశాల నిపుణులు, సాంకేతిక సంస్థలను సంప్రదించి డిజైన్లు సరిగ్గానే ఉన్నట్టు ధ్రువీకరించు కోవచ్చని ఇఎన్సీ జనరల్ సూచించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. ఈ అప్పటి నుంచి కాశేశ్వరంపై విజిలెన్స్ విచారణ, ఎన్ఎస్ఎ విచారణ, పిసిఘోష్ జ్యూడిషల్ విచారణ వేశారు. ఎన్డీఎస్ఏ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో వేసిన విచారణ కమిటి నివేదిక ఇవ్వడంతో ఏప్రిల్ 24న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఈ నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా బ్యారేజ్ ల లోని లోపాలను గుర్తించడానికి జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను నిర్వహించి వాటి ద్వారా అందే సమాచారం ఆధారంగా ఆయా బ్యారేజ్ల పునరుద్ధరణకి డిజైన్లు, డ్రాయింగ్స్ను రూపొందించాల్సి ఉంది. ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సిడివో సిఇ తమ ఇంజనీర్లతోకానీ, అత్యు న్నత సంస్థల సహాయంతో వ్యారేజిల పునరుద్ధ రణకు డిజైన్లు, డ్రాయింగ్స్ తయారీకి అవసరమైన చర్యలు తీసు కోవాలని ఆదేశిస్తూ తాజాగా ఇఎల్సి జన రల్ సూచిం చడంతో సిడివో మొత్తానికి కన్సల్టెన్సీ ఏర్పా టుకు ముం దుకు వచ్చింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధ రణకు ఆవు “రమైన డిజైన్ల ఆమోదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా నిర్దిష్టగడువులు విధించుకుని ఈ పనులు పూర్తిచే యాల ని సిడిఒ సిఇని ఇఎల్సి జనరల్ ఆదేశించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Indiramma Housing Scheme: ముగ్గు పోయని ఇళ్లు రద్దు ఆగస్టు 1 వరకు అవకాశం

Breaking News Consultancy Support kaleshwaram project Kaleshwaram Repairs Kaleshwaram Revival latest news Revanth Reddy government Telangana Irrigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.