📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu news: Kaleshwaram project: రంగనాయకసాగర్ లోని నీళ్లు కాళేశ్వరం జలాలని నిరూపిస్తావా?

Author Icon By Tejaswini Y
Updated: December 8, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రంగనాయక సాగర్లో ఉన్న నీళ్లు కాళేశ్వరం బ్యారేజీ(Kaleshwaram project)ల నుంచి ఎత్తిపోసినవే అని నిరూపిస్తావా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Ailaiah) సవాల్ చేశారు. సిఎల్పి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ హరీష్ రావు సిఎం ను రంగనాయక్ సాగర్ వేస్తాను మునిగితే కాళేశ్వరం ఉన్నట్లు మునగపోతే లేన్నట్లు అని అనడం నీస్థాయికి తగదని ధ్వజమెత్తారు. అందుకే మా ముఖ్యమంత్రి హరీష్ రావును ఆరడుగులు పెరిగావు కాని చటాక్ ధమాక్ లేదని ఎత్తిచూపుతారని ఎద్దేవా చేశారు.

Read Also:  Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ

Can you prove that the water in Ranganayaka Sagar is the water of Kaleshwaram

కాళేశ్వరం నీళ్ల వివాదం

తెలంగాణ ప్రజలు రెండేళ్ల క్రితమే నీకు, నీ మామకు, నీ బామ్మర్ది కి బండ కట్టి కాళేశ్వరంలో వేశారని అపహాస్యం చేశారు. మీరేప్పుడో కూలిన కాళేశ్వరంలో మునిగిపోయారని విమర్శించారు. మీ పార్టీ కూడా అప్పుడే కాళేశ్వరంలో సమాధి అయిపోయిందనీ కాళేశ్వరం(Kaleshwaram project) పాపం మమ్మల్ని గోదావరి లో కలిపేసిందనీ అన్నారు. నీ పిల్లల మీద ఓట్టేసి చెప్పు మేడిగడ్డ కు వర్రెలు పాయలేదా..? అని ప్రశ్నించారు. అన్నారం సిపేజిలో రాలేదా..? కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు రెండేళ్ల నుంచి చుక్కనీళైనా ఎత్తిపోశారా? అని ఆయన 205 నిలదీశారు.

బీఆర్ఎస్ పత్తా లేదంటూ ఐలయ్య ఎద్దేవా

జనం ఛీ కొట్టినా ఇంకా హరీష్ రావు కు ఏ మాత్రం సిగ్గు రావడం లేదని చీత్కరించారు. జూబ్లీహిల్స్ లో బండకేసి బాదినా బుద్దిరావడం లేదని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో మీ పార్టీ పత్తా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. అనేక గ్రామాల్లో పోటీ మా పార్టీ అభ్యర్థుల మధ్యే ఉంది తప్ప బిఆర్ఎస్ ఎక్కడా కనిపించడం లేదని అన్నారు నాలుగు రోజులు ఆగు రాష్ట్రంలో నీ జెండా కూడా కనిపించదని చెప్పారు. మా ముఖ్యమంత్రి పైన నోరుపారేసుకుంటే నీకు తగిన శాస్త్రి చేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Beearla Ilaiah Harish Rao criticism kaleshwaram project Kalwakurthy politics Ranganayaka Sagar Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.