📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Phone tapping: కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదలం: ఆది శ్రీనివాస్

Author Icon By Sharanya
Updated: July 25, 2025 • 10:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: కాళేశ్వరం పై విచారణ జరుగుతోందని అందులోని సూత్రధారులు, పాత్రధారులను ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)హెచ్చరించారు. గాంధీ భవన్లో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిజెపి బిఆర్ఎస్ గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీ అనే వైఖరితో ప్రదర్శిస్తున్నారని వెనుకబడిన తరగతుల ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.

ఫోన్ ట్యాపింగ్ దొంగల పాపం పండింది

తెలంగాణ (Telangana)లో పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేసి దొరికిపోయిన దొంగలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా సొంత ప్రత్రికలో రోత రాతలు రాస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ దొంగల పాపం పండిదని ఆది అన్నారు. లోక్సభ ఎన్నికలో గుండు సున్నాకు పరిమిత మయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారులు, పాత్రధారులు పాత్ర తేలాల్సి ఉందని తెలి పారు. కలుగులో దాకున్న కూడా ఫోన్ ట్యాపింగ్ నిందితులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కెటిఆర్ లోకేష్ తో భేటీ అయ్యారని సిఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల్లో తప్పే ముందని ప్రశ్నించారు. వారి ట్యాపింగ్ చేయాల్సిన కర్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ బురద కాంగ్రెస్ పార్టీకి అంటించే ప్రయత్నం బిఆర్ఎస్ భేటీకి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేదని ఫోన్ చేస్తోందని ఆయన అన్నారు. మా నాయకుడు దమ్మున్న నాయకుడు అని కీర్తించారు. మా పార్టీలో అంతర్గత ప్రజా స్వామ్యం ఎక్కువ, బిఆర్ఎస్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ అని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదు

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేసే బిఆర్ ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. కెసిఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించలేక ఫాం హౌస్ కి పరిమితమయ్యారని అన్నారు. మీ పత్రికల్లో మీరే రాసుకొని డబ్బా కొట్టుకోండని అన్నారు మీ పత్రికలో రోత రాతలు మానుకో కుంటే మంచిదని హితవు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ తో సినీతారలు, జడ్జీలు, భార్య భర్తలు మాట్లాడుకున్న మాటలను విన్నారని కవితే బహిరంగంగా చెబుతున్నారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ బురద మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు లెక్క తేలాల్సి ఉందని చెప్పారు బిఆర్ఎస్ పార్టీనుంచి తెలంగాణ పదం తొలగించిన రోజే పేగు బంధం తెగిపోయిందని అన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు 237 కోట్ల ప్రయోజనం కలిగిందని వెల్లడించారు. బిఆర్ఎస్ పదేళ్ల హయంలో పది రేషన్ కార్డులు ఇవ్వలేదు, పదేళ్లలో ఏ ఒక్క నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రం కాస్తా 7 లక్షల కోట్లకు అప్పులు కట్టే దుస్థితి దాపురించింది. ఎస్సీ వర్గీకరణ, బిసికుల గణన చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త శుద్ధి నిరూపించుకుందని అన్నారు. ప్రశ్నించే గొంతులకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు .

కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఏమిటి?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల సమయంలో పలువురు అధికారుల ఫోన్ సంభాషణలు అనధికారికంగా ట్యాప్ చేయబడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న నేతల ప్రోత్సాహంతో కీలక సమాచారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆది శ్రీనివాస్ ఏమన్నారు?

తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఆది శ్రీనివాస్ పేర్కొన్న దానిలో, “కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము. వారి మీద కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,” అని స్పష్టంగా హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Seethakka: పెన్షన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి : మంత్రి సీతక్క

Aadi srinivas Breaking News BRS Government Controversy kaleshwaram project latest news Phone Surveillance Phone Tapping Case Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.