Kakatiya University: మెస్‌లో కోడికూర కోసం కొట్టుకున్న విద్యార్థులు

Read Time:  1 min
Kakatiya University: మెస్‌లో కోడికూర కోసం కొట్టుకున్న విద్యార్థులు
FONT SIZE
GET APP

Kakatiya University: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ (KU) ఆదివారం సాయంత్రం రణరంగంగా మారింది. ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థులు హాస్టల్ మెస్‌లో వడ్డించే ఆహారం విషయంలో ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. కేవలం కోడికూర (చికెన్ కర్రీ) విషయంలో మొదలైన చిన్న వాగ్వాదం పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.. ఆ విద్యార్థుల పుర్రెలు పుచ్చకాయల్లా పగిలి పోయాయి.

యూనివర్సిటీలోని కామన్ మెస్‌లో ఆదివారం సాయంత్రం భోజన సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. చికెన్ కర్రీ వడ్డిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులకు ముక్కలు ఎక్కువగా వస్తున్నాయని, తమకు తక్కువ వడ్డిస్తున్నారంటూ ఒక వర్గం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాల విద్యార్థుల మధ్య మాట మాట పెరిగి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.

Read also: Telangana Government: అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ..

Kakatiya University: మెస్‌లో కోడికూర కోసం కొట్టుకున్న విద్యార్థులు
Kakatiya University: Students fight over chicken curry in the mess

ముందు నుంచే వివాదం

ఈ ఘర్షణలో ఒక విద్యార్థి తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. మరో ఇద్దరు విద్యార్థులు కూడా గాయపడ్డారు. సమాచారం అందుకున్న యూనివర్సిటీ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘర్షణ కేవలం ఒక్కరోజుతోనే మొదలైంది కాదని తెలుస్తోంది. శనివారం ఉదయం ఉడకబెట్టిన గుడ్ల విషయంలోనూ విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ కోపం మనసులో ఉంచుకున్న విద్యార్థులు ఆదివారం చికెన్ కర్రీ సాకుతో దాడులకు దిగినట్లు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.