📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kadiyam Srihari-KCR: జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి

Author Icon By Anusha
Updated: February 19, 2026 • 2:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kadiyam Srihari-KCR: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ఆయన నిలదీశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినప్పటికీ, ఇంకా పాత అంశాలనే వాడుకుని రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also: Doctorate to Kinnera Mogulaiah : డాక్టరేట్ అందుకున్న పద్మశ్రీ కిన్నెర మొగులయ్య

సెంటిమెంట్‌తో ఇంకెన్నాళ్లు?

కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశానికి జాతిపిత ఒకరేనని, అది మహాత్మాగాంధీ అని అన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Kadiyam Srihari-KCR: You should be ashamed to call yourself the Father of the Nation

జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.కేసీఆర్ తన హయాంలో అవకతవకలు, అక్రమాలు చేసి కుంభకోణాలలో ఇరుక్కున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే అది కూలిపోయిందని, రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. ప్రజలు అధికారం నుంచి దింపినా వారికి ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Kadiyam Srihari-KCR latest news Telangana Sentiment Politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.