📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

K.V.Ramanachari: తెలుగుభాషకు సొంతం అవధానం

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి.రమణాచారి

హైదరాబాద్ (నాంపల్లి) : తెలుగుజాతికి, తెలుగుభాషకు సొంపైన, సొంతమైనది అవధానం (Avadhana Telugu) ప్రక్రియని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు, విశ్రాంత ఐఎఎస్ అధికారి డా. కె.వి. రమణాదారి(K.V.Ramanachari) అన్నారు. అవధానం ఆజరా మరం, అవధానాలతో శతావధానులు, సహస్రావధానులతో తెలుగునీల, తెలుగునేల జగత్ విదితం కావాలని, తెలుగునాట అవధాన ప్రక్రియ దినదిన ప్రవర్ధమానం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

రవీంద్రభారతిలో 1995 ద్విశతావధానం కొత్త ప్రక్రియను ఆనాటి ముఖ్యమంత్రి డా. నందమూరి తారక రామారావు ప్రారంభించారని, నాటినుండి అంచలంచలుగా శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, పంచశాస్త్రావధానం ఒక దశాబ్దకాలం తెలుగునాట అవధానాలు నడిచాయని రమణాచారి గుర్తుచేశారు. శృంగేరి జగద్గురువుల దివ్యాశీసులతో వబ్రోత్సవ భారతి- శతావధాన సంక్రాంతి పేరున భారతీతీర్థ ప్రాంగణంగా నామకరణం చేసిన తెలంగాణ సారస్వత పరిష త్తులోని డా. దేవులపల్లి రామానుజరావు కళావేదికలో దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక నిర్వహణలో శుక్రవారం ఉదయం 8గంటలకు రెండురోజులపాటు శతావధాని తిలక ఉప్పలధడి యం భరత్ శర్మ శతావధానం కన్నులపండువగా ప్రారంభమైంది.

K.V.Ramanachari: Telugu language deserves attention

త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సంచాలకత్వంలో జరగనున్న ఈ శతావధానాన్ని ప్రభుత్వ మాజీ సలహాదారు డా. కె.వి. రమణా చారి, మహామహోపాధ్యాయ విద్యావికాస పరిషత్ నిర్వాహకడు మరుమాముల దత్తాత్రేయశర్మ, శతావధానులు ఆముదాల మురళి, ములగ అంజయ్య, దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక మరుమాముల వెంకటరమణశర్మ తదితరులు జ్యోతిప్రకాసనం చేసి శతావధానాన్ని ప్రారంభించి ప్రసంగించారు. శతావధానం అనేది ఒక మహా యజ్ఞం వంటిదని, దీనికి పూనుకున్న నిర్వాహ కులను ఎంతగానో అభినం దించారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత విధిగా పాల్గోవాలని సూచించారు. వీటికి ప్రభుత్వం తరఫున కావా ల్సిన సహకారం అందించడానికి వీలుగా తన శాయశక్తులా సంపూర్ణ ప్రయత్నం చేస్తానని హామీనిచ్చారు.

ఎం. వెంకటరమణశర్మ ప్రారంభోపన్యాసంలో ఉప్పలధడియం భరత్ శర్మ 10వ తరగతి పూర్తికాగానే అవధానాలు చేయడం ఆరంభించి జగద్గురువుల అను గ్రహంతో ఉద్దండులకు సరితూగేస్థాయిలో నేడు శతావధానంతో రంజింప జేయనున్నట్లు తెలిపారు. సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు అంశాలతో వంద మంది పృచ్చకులు వివిధ అంశాలపై సంధించిన ప్రశ్నలకు బ్రహ్మశ్రీ ఉప్పలథడియం భరతశర్మ ఏకధాటిగా ఈ రెండురోజులపాటు సమాధానాలు చెప్పను న్నారని, రేపు సాయంత్రం శతావధాన విజయో త్సవ సభకు తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదవిశ్వ విద్యాలయ డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ శర్మ, రఘునాథశర్మ. కె. వి. రమణాచారిఉభయ తెలుగురాష్ట్రాల్లోని అష్టావ ధానులు, పండితులు, సాహితీవేత్తలు పాల్గోనున్నారని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Avadhana Telugu Dr KV Ramanachari Google News in Telugu Sahasravadhana Shatavadhana Telangana Saraswata Parishat Telugu culture Telugu Literature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.