📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

K Narayana: తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్యాయం చేయలేదు – సిపిఐ కార్యదర్శి నారాయణ

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేయడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ (K Narayana) అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏళ్లుగా పంచాయితీ కొనసాగుతూనే ఉందని.. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి బనచర్ల ప్రాజెక్టు (Banacherla Project) ను నిర్మించేందుకు పూను కోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. దీంతో ఈ వివాదంపై కేంద్ర జలశక్తి కలుగుజేసుకుని ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించిందన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని నారాయణ (K Narayana) సూచించారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా మన్నారు. నారాయణ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రతి అంశంపై ప్రధాన ప్రతిపక్షం సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని తెలంగాణకు రేవంత్రెడ్డి అన్యాయం చేయలేదని నారాయణ అన్నారు. తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయ లేదని అంటూ.. పొట్టివాడు గట్టివాడు అని ప్రశంసించారు. రెండు రాష్ట్రాలు నీటి పంపిణీ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. నీటి ప్రాజెక్టుల (Water projects) గురించి తమ పార్టీ ఎప్పుడూ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో నీటి అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎ స్ గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయిందని ఇప్పుడు సెంటిమెంట్లు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొడుతున్నారని విమర్శిం చారు. రేవంత్రెడ్డితో చర్చించకపోవడం చంద్రబాబు తప్పేనని బనకచర్ల గురించి చంద్ర బాబు మొదట మాట్లాడాల్సింది తెలంగాణ ముఖ్యమంత్రితో అని అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ సీఎం ఆ ప్రాజెక్టను వ్యతిరేకించారని అన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Outer Ring Train: ఎనిమిది జిల్లాలను కలుపుతూ ఔటర్ రింగ్ రైలు ప్రయాణం

CPI leader CPI statements K Narayana latest news Revanth Reddy Telangana Governance Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.