📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Justice A.K. Singh: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఎ.కె.సింగ్‌

Author Icon By Sharanya
Updated: May 29, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice) జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలో మే 26న నిర్వహించిన కొలీజియం సమావేశంలో 34 మంది న్యాయమూర్తులపై కీలక బదిలీలను ఆమోదించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం త్రిపుర హైకోర్టులో సీజేగా ఉన్న జస్టిస్‌ ఎ.కె. సింగ్‌ను తెలంగాణకు బదిలీ చేయాలని సిఫార్సు చేశారు.

పూర్వ సీజే జస్టిస్‌ ఆలోక్ అరాధే స్థానం భర్తీ

తెలంగాణ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఆలోక్ అరాధే జనవరిలో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండగా, ఇప్పుడు జస్టిస్‌ ఎ.కె. సింగ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఇది రాష్ట్ర న్యాయవ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురానుంది.

న్యాయ కుటుంబ నేపథ్యం

జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ (Justice Aparesh Kumar Singh) 1965 జులై 7న జన్మించారు. వీరి డాక్టర్‌ రామ్‌గోపాల్‌ సింగ్, డాక్టర్‌ శ్రద్ధా సింగ్‌ దంపతుల కుమారుడు. ఆయన కుటుంబంలో పలువురు న్యాయవ్యవస్థలో పనిచేసిన వారే. ఆయన తల్లి వైపు ముత్తాత జస్టిస్‌ బీపీ సిన్హా సుప్రీంకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా, తాత శంభూప్రసాద్‌ సింగ్‌ పట్నా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, మామలు జస్టిస్‌ బిశ్వేశ్వర్‌ప్రసాద్‌ సింగ్‌ 2001-07 మధ్య, జస్టిస్‌ శివకీర్తిసింగ్‌ 2013-16 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సేవలందించారు.

విద్యా, వృత్తి నేపథ్యం

జస్టిస్‌ సింగ్‌ ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ (ఆనర్స్), ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 2001 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ ఝార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగించారు. రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, సర్వీస్, ఆర్బిట్రేషన్, లేబర్‌ కేసుల్లో న్యాయవాదిగా విశేషానుభవం గడించారు. 2012 జనవరి 24న ఝార్ఖండ్‌ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2014 జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022 డిసెంబరు 20 నుంచి 2023 ఫిబ్రవరి 19 వరకు ఝార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2023 ఏప్రిల్‌ 17న పదోన్నతిపై త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన ఆయన ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు.

హైకోర్టుల్లో బదిలీలు – తాజా పరిణామాలు

ఈసారి కొలీజియం చేపట్టిన బదిలీలలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పట్నా, కర్ణాటక హైకోర్టుల్లో పనిచేస్తున్న జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కన్నెగంటి లలిత, జస్టిస్‌ సి.సుమలతలను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్‌ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా ప్రస్తుతం సీనియారిటీ పరంగా ఆయన 5వ స్థానంలో ఉన్నారు. జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ను తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ చేయడం రాష్ట్ర న్యాయ వ్యవస్థకు మరింత స్థిరత్వం, న్యాయసిద్ధాంతాల పరిరక్షణలో మద్దతు కలిగించనుంది.

Read also: Kavitha: కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు: కవిత

#ChiefJusticeAKSingh #HighCourtUpdates #Justice Aparesh KumarSingh #JusticeAKSingh #NewCJ #TelanganaHighCourt #TelanganaJudiciary Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.