📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Gaddar Awards : 15 మందితో జ్యూరీ నియామకం

Author Icon By Sudheer
Updated: April 17, 2025 • 11:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన “గద్దర్ అవార్డులు” ఇప్పుడే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ప్రజా గాయకుడు, ఉద్యమ నాయకుడు గద్దర్ పేరు మీదుగా ఈ అవార్డులు ప్రారంభించడంపై సినిమా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అవార్డుల ఎంపిక కోసం సీనియర్ నటి జయసుధ అధ్యక్షతన 15 మంది సభ్యులతో జ్యూరీ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ జ్యూరీలో నటి జీవిత, దర్శకులు దశరథ్, వీఎన్ ఆదిత్య, నందిని రెడ్డి, శివ నాగేశ్వరరావు, రచయిత కాసర్ల శ్యామ్, నిర్మాత రాజా తదితరులు సభ్యులుగా ఉన్నారు.

2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన ఉత్తమ సినిమాలకు

జ్యూరీ సమావేశంలో సినిమా నిపుణులతో పాటు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ పాల్గొన్నారు. అవార్డుల ఎంపిక ప్రక్రియను నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ అవార్డులు 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన ఉత్తమ సినిమాలకు వర్తిస్తాయి. పైడి జయరాజ్, కాంతారావుల పేరిట ప్రత్యేక పురస్కారాలు, ఉర్దూ సినిమాలకు ప్రోత్సాహంగా బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా ప్రకటించనున్నారు.

మొత్తం 1248 నామినేషన్లు

ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 1172 వ్యక్తిగత విభాగాల్లో, 76 నానా ఫిల్మ్, చిల్డ్రన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, క్రిటిక్ రచనలు వంటి విభాగాల్లో దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో, గద్దర్ అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని వచ్చే నెలలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇవి తెలుగుసినిమాకు కొత్త ఉత్తేజాన్ని ఇవ్వనున్నాయి.

gaddar gaddar Awards

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.