— ఆనకట్ట నిర్మాణంపై డి.సిఎం భట్టితో చర్చించిన మంత్రి జూపల్లి
Jupally Krishna Rao: నాగర్ కర్నూల్: కృష్ణ గోదావరి నదులపై ఆక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రభుత్వం అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని పది సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర పాలకుల కుట్రలకు తెలంగాణ పాలకులు బలవుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు రావు (Jupally Krishna Rao) అన్నారు. కృష్ణ. గోదావరి నదులపై తెలంగాణ నీటి వాటా తేల్చాలని దాని కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కృష్ణా నదిపై జోగులాంబ గద్వాల జిల్లా అడ్డలపూర్ మండలం గుందిమల్ల గ్రామం ఒకవైపు, మరోవైపు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామం దగ్గర వెల్లూరు గుందిమల్ల ఆనకట్ట నిర్మాణంతో కృష్ణా నదిలో ప్రస్తుతం ఉన్న శ్రీశైలం నీటి లెవెల్ 885 అడుగుల మేరకే ఆనకట్ట నిర్మించి సుమారు 60 టీఎంసీల వాటా నీటిని, మరో 60 టీఎంసీల వరద జలాలను వాడుకునే వెసులుబాటు వెల్లూరు గుందిమల్ల ప్రాజెక్టు తో సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సూచించారు.
శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం జరగలేదు: మంత్రి జూపల్లి ఆవేదన
శనివారం చిన్నంబావి మండల పరిధిలోని వెల్లూరు గ్రామంలో 33/11 సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉపముఖ్యమంత్రికి మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణానదిని (Krishna River) చూపిస్తూ ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 65 గ్రామాలను, 40 వేల సారవంతమైన భూములను, ఇండ్లు సర్వం కోల్పోయామని, నాడు అరకొర పరిహారాలతో రైతులకు వరిహారం అందించడంలో అన్యాయం జరిగిందని, అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పించడంలో గత ప్రభుత్వాలు 11వేల కుటుంబాలకు విద్యా, ఉద్యోగ, గృహ నిర్మాణాలలో నిర్వాసితుల కుటుంబాలకు జీవో 98 ద్వారా ఉద్యోగాలు కల్పించడంలో కూడా అన్యాయం జరిగిందని మంత్రి జూపల్లి సూచించారు.
గొదావరి-కృష్ణా జలాలపై జూపల్లి గట్టి హెచ్చరిక
గతంలో జరిగిన పలు నష్టాల నుండి తేరుకోవడానికి వాటాగా సబ్మర్చ్ గ్రామాలకు దక్కాల్సిన జూరాల నీరు సైతం రాకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని అందుకే ఆంధ్రప్రదేశ్ కృష్ణా, గోదావరి నదులపై అక్రమ ప్రాజెక్టులకు బుద్ధి చెప్పడానికి వెల్దూరు గుందిమల్ల బ్యారేజ్ నిర్మాణం చేపట్టి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి జూపల్లి సూచించారు. దీంతో స్పందించిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొల్లాపూర్ సభలో మాట్లాడుతూ గత టిఆర్ఎస్ పాలకుల తప్పిదాల వల్లే 10 ఏళ్లు వాటా నీటిని కోల్పోయామని, తాత్కాలిక ఒప్పందాలతో 299 టీఎంసీలతో ఒప్పందాలను చేసుకోవడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్ర ప్రభుత్వం బనకచర్ల ఎలా కడుతుందో చూస్తామని, తెలంగాణ సాగునీటి వాటా తేల్చాకే ఏ నిర్మాణాలైనా చేపట్టాలని ఆంధ్రను హెచ్చరించారు.
వెల్టూర్ గుందిమల్లపై ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఆమోదం
వెల్టూరు గుందిమల్ల ప్రాజెక్టుతో తెలంగాణ నీటి వాడా కోసం కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. శనివారం వేలూరు గ్రామంలో బ్యారేజ్ సాధన సమితి నాయకుల విన్నపం మేరకు కాంగ్రెస్ నాయకులు కళ్యాణ్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాజెక్టు పూర్తి వివరాలను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. త్వరలోనే తెలంగాణ వాటా నీటి వినియోగం కోసం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేపడతామని అన్నారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాలని వారు కోరారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టు వివరాలపై పూర్తి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొత్త కళ్యాణ్ కుమార్, జూపల్లి అరుణ్, బ్యారేజ్ సాధన సమితి నాయకులు పెరుమాల శ్రీనివాస్, పెద్ద మల్లయ్య, వెంకటేశ్, తిరుపతయ్య, మద్దూరు నాగరాజు యాదవ్, కాశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ జూపల్లి కృష్ణారావు ఎవరు?
జూపల్లి కృష్ణారావు (జననం 10 ఆగస్టు 1955) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ మంత్రి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నదులపై అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మిస్తోంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై అనుమతి లేకుండా ఆక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోంది.
వెల్లూరు గుందిమల్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీరు లభించనుంది?
ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సుమారు 60 టీఎంసీల వాటా నీరు మరియు 60 టీఎంసీల వరద జలాలు లభించనున్నాయి.
Read hindi News: hindi.vaartha.com
Read also: