📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

Author Icon By sumalatha chinthakayala
Updated: December 30, 2024 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నేడు అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, బెయిల్ పై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ ను పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జనవరి 3కు తీర్పు వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడం తెలిసిందే. దాంతో రెగ్యూలర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ లాయర్లు ప్రయత్నిస్తున్నారు.

కాగా, సినీ హీరో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో A11గా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు లో విచారణకు హాజరయ్యారు. కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు ముగుస్తుండటంతో తెలంగాణ హైకోర్ట్ నుంచి తనకు మధ్యంతర బెయిల్ మంజూరైందని విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కోర్టుకు విన్నవించారు. అదేవిధంగా ఇప్పటికే ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌పై మెజిస్ట్రేట్ విచారణ చేపట్టారు. అయితే, కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో ఆయన కేసు తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు. దీంతో రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు జనవరి 3కు తీర్పు వాయిదా వేసింది.

Allu Arjun BAIL bail petition judgment Adjournment pushpa 2 Sandhya Theatre Incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.