📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:Jublieehills Results: అహంకారం తగ్గించుకోవాలన్న సీఎం పై KTR కౌంటర్!

Author Icon By Pooja
Updated: November 15, 2025 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భవిష్యత్తులో జూబ్లీహిల్స్(Jublieehills Results) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని తప్పక సాధిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యంగా తెలిపారు. గత సాధారణ ఎన్నికల్లో 80 వేల ఓట్లు వచ్చిన చోట, ఈ ఉప ఎన్నికలో కూడా 75 వేల ఓట్లు రావడం పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకులు, రిగ్గింగ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఓట్లలో కేవలం ఐదు వేల తేడా మాత్రమే రావడం తమ శక్తిని చూపించే అంశమన్నారు. రహమత్‌నగర్‌లో జరిగిన ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను కేటీఆర్ పరామర్శించారు. తమ కార్యకర్తపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, జూబ్లీహిల్స్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని స్పష్టం చేశారు.

Read Also: Bihar Result: మహిళ ఓట్లే నితీష్ కుమార్ గెలుపుకు కారణమా?

Jublieehills Results

“కాంగ్రెస్ గూండాయిజం స్పష్టంగా కనిపిస్తోంది”

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు(Jublieehills Results) వెలువడిన 24 గంటల్లోనే కాంగ్రెస్ వర్గాలు అశాంతి సృష్టిస్తున్నాయని కేటీఆర్(KTR) ఆరోపించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రతిపక్షంపై దాడుల వంటి చర్యలు చేయలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజం ప్రజల ముందే బయటపడుతోందని అన్నారు. దొంగ ఓట్లు, డబ్బు రాజకీయాలు, గూండా గిరితో కాంగ్రెస్ విజయం సాధించిందని కేటీఆర్ విమర్శించారు.

“అహంకారం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు”

సీఎం రేవంత్ రెడ్డి చేసిన “అహంకారం తగ్గించుకోవాలి” వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. నిజమైన అహంకారం ఎవరికి ఉందో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన విజయ ఊరేగింపులు కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ గూండాయిజం కొనసాగితే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

ktr Latest News in Telugu Revanth Reddy Telangana politics Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.