జూబ్లీహిల్స్ లో( Jubilee Hills Results) కాంగ్రెస్ ఊహించిన విజయాన్నే సాధించింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తన్నారు. మాగంటి హరినాథ్ అకాలమరణంతో ఉప ఎన్నికలు ఇక్కడ అనివార్యం అయ్యాయి.
బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా మాజీ సీఎం కేసీఆర్ మాగంటి హరినాథ్ భార్య మాగంటి సునీతను బరిలో పెట్టారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను హైకమాండ్ నియమించింది. దీంతో ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా జరిగింది.
Read Also: Globe Trotter Event: మహేశ్ మూవీ పాస్‌పోర్ట్ పాస్‌లు సోషల్‌లో దుమారం
నవీన్ యాదవ్ కే విజయావకాశాలు..
నేడు జరుగుతున్న కౌటింగ్ లో ఇప్పటివరకు నవీన్ యాదవ్ కే అధికంగా ఓట్లు వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
హైదరాబాద్ లో కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిచింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లలో గెలిచింది. లాస్యనందిత దుర్మరణంతో ఆ సీటును, మాగంటి హరినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నది. కాగా గెలుపుకోసం సీఎం రేవంత్ రెడ్డి తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లకుండా, గెలుపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: