Latest News: Jubilee Hills Result: మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉత్కంఠ

Read Time:  1 min
Latest News: Jubilee Hills Result: మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యంతో ఉత్కంఠ
FONT SIZE
GET APP

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాల (Jubilee Hills Result) పై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఈ మూడు రౌండ్లు ఇప్పటికే జూబ్లీహిల్స్‌ (Jubilee Hills Result) రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

Read Also: TG: రాష్ట్ర ఖజానాపై ఆర్థిక ఒత్తిడి రూ.45,139 కోట్లకు చేరిన లోటు

మొత్తం మూడు రౌండ్లు కలిపి చూస్తే

మూడో రౌండ్‌లో బీఆర్ఎస్‌ (BRS) కు 12503 ఓట్లు పోలైయ్యాయి. కాంగ్రెస్‌కు 12292 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ మూడో రౌండ్‌లో 211ఓట్లు లీడ్ వచ్చింది. మూడో రౌండ్‌లో రహమత్ నగర్, వెంగళ్‌రావు నగర్ ఓట్లను లెక్కించారు. మొత్తం మూడు రౌండ్లు కలిపి చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.

యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో నోటాకు 99 ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తర్వాత నాల్గొ స్థానంలో నోటా (NOTA) నే ఉండటం ఆశ్చర్యం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.