తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరుకావడం ఒకవైపు చర్చనీయాంశమైతే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ (Naveen yadav) అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం మరోవైపు అందరి దృష్టిని ఆకర్షించింది. తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్, అనుభవజ్ఞుడిలా మాట్లాడటం ప్రశంసలు పొందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ తన రాజకీయ ప్రయాణాన్ని సభ ముందుంచారు.
Read also: Numaish 2026: హైదరాబాద్‌లో 85వ నుమాయిష్‌కు కౌంట్‌డౌన్
Jubilee Hills MLA
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ
సభను ఉద్దేశించి ప్రసంగించిన నవీన్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, గతంలో తన పేరును సభలో ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అదే అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యేగా కూర్చోవడం తనకు గౌరవమని పేర్కొన్నారు. సభ మర్యాదలను కాపాడుతూ, ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
తొలి ప్రసంగంతోనే సమస్యలపై స్పష్టత
కృతజ్ఞతలకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలను నవీన్ యాదవ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో కృష్ణానగర్ ప్రాంతం జలమయమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఇందుకు కారణమని, శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే పలు బస్తీల్లో ఇళ్లకు అతి సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లైన్లను భూగర్భ కేబుల్స్‌గా మార్చాలని, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తొలి ప్రసంగంతోనే సమస్యలపై స్పష్టత చూపిన నవీన్ యాదవ్‌ను తోటి సభ్యులు అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: