దొంగోట్లు వేసేందుకు వచ్చిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని నిరసనకు దిగిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) కూడా ఉన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో(Jubilee Hills Election) దొంగ ఓట్లు వేయించేందుకు భారీగా ప్రజలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ యూసఫ్ గూడ పరిధిలోని మొహమ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగోట్లు వేసేందుకు వచ్చిన ప్రజలను బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఇతర నాయకులు పట్టుకున్నారు. దీంతో పోలీసులు వీరిపై లాఠీచార్చ్ చేశారు. ఎన్నికలు ఇంకో గంటలో ముగుస్తుందనగా కాంగ్రెస్ భారీ రిగ్గింగ్ కు పాల్పడుతుందని బీఆర్ ఎస్ నాయకలు ఆరోపిస్తున్నారు.
Read Also: TGSRTC: ఐదు రోజుల కార్తికమాసం స్పెషల్ ప్యాకేజ్
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు
తమ ఇంట్లో ఓ ముసలావిడ ఓటు కూడా కాంగ్రెస్ వాళ్లు వేసేశారు అని బీఆర్ ఎస్ అభ్యర్థిమాగంటి సునీత ఆరోపించారు. చనిపోయిన వాళ్ల ఓట్లు ఎలా వేస్తారు? వారి ఫోటోలు మార్చి దొంగ ఓట్లు వేస్తున్నారని, ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడా చూడలేదని ఆమె కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: