జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills election) ప్రచారం ముగిసినప్పటికీ, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, చీరలు, మద్యం వంటివాటిని పంచుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికలు(Elections) హోరాహోరీగా ఉండటంతో, అభ్యర్థులు ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏడు డివిజన్లలో ప్రచారం కోసం రెండు పార్టీలూ తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను విస్తృతంగా వినియోగించుకున్నాయి.
Read Also: AP Cabinet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చలు
షేక్‌పేటలో డబ్బుల పంపిణీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని పార్టీలు ప్రలోభాలకు దిగాయి. నియోజకవర్గ ఓటర్లు తమ పార్టీకి ఓటు వేసేందుకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టాయి. షేక్‌పేట డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బుల పంపిణీని ప్రారంభించింది. ఆయా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
హోటల్‌పై పోలీసుల రైడ్, అరెస్టులు
మరోవైపు, ఎర్రగడ్డలోనూ అధికార పార్టీ నాయకులు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం హోటల్ పాలక్‌లో సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రైడ్ చేశారు. దాదాపు 11 మందిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: