తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఈవీఎంలను (EVMs) సంబంధిత పోలింగ్ కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. నగరంలో సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసులు మోహరించారు. మొత్తం ఓటర్లలో యువత, మహిళా ఓటర్ల ఉత్సాహం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ
ఈ ఉపఎన్నికకు కారణం ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కావడం. ఆయన అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో జూబ్లీహిల్స్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు ప్రధాన పార్టీలు — కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ — తమ అభ్యర్థుల విజయం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. రాత్రివేళ వరకు ప్రచారం ఉత్కంఠభరితంగా సాగింది. నగరంలోని ముస్లిం, రెసిడెన్షియల్, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలూ ప్రత్యేక వ్యూహాలు రూపొందించాయి.

ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రతి పార్టీ తమ అభ్యర్థిని విజేతగా నిలబెట్టేందుకు అత్యంత కృషి చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, బీఆర్ఎస్ ఈ సీటు గెలిచి ప్రజల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. ఇక బీజేపీ ఈ ఎన్నికను నగరంలో తమ స్థాయిని పెంచుకునే అవకాశంగా భావిస్తోంది. పోలింగ్ పూర్తయ్యాక 14న కౌంటింగ్ జరగనుంది, ఫలితాలు నగర రాజకీయాలకు కొత్త దిశను చూపే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/