ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Election) ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికలో సుమారు 2.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేశారు.
Read Also: Jubilee Hills Bypoll Polling : నేడే ‘జూబ్లీహిల్స్’ పోలింగ్..
ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని
ఈ ఎన్నికలో (Jubilee Hills By-Election) మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్యే ఉండనుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత (Maganti Sunitha) బీఆర్‌ఎస్ తరఫున, నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరపున, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది.
నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నవోదయా కాలనీలోని 290వ నంబర్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: