📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Jubilee Hills by-election – బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి భార్య..

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు (Jubilee Hills by-elections) జరగనున్న విషయం తెలిసిందే.ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం చెందడంతో ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేశాయి.బుధవారం (నేడు) తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య ప్రకటన చేశారు. దివంగత గోపీనాథ్ భార్య మాగంటి సునీతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సునీతకు పార్టీ తరఫున పూర్తి స్థాయి మద్దతు లభిస్తుందని, గోపీనాథ్ స్థానంలో ఆమె ప్రజా సేవను కొనసాగిస్తారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని

ఈ కార్యక్రమంలో మాగంటి సునీతతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రజలకు గోపీనాథ్ ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలుసు. ఆయన ప్రజల కోసం చివరి వరకు శ్రమించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే, సునీత గెలవడం అత్యవసరం. ఈ ఉప ఎన్నికలో మాగంటి సునీతకు ఘనవిజయం సాధింపజేయాలని ప్రతి కార్యకర్త కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ ఉప ఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.5 వేలు పంచితే తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారంటూ.

కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్క దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. అలానే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా పెద్దల జోలికి వెళ్లదని.. అందుకే సీఎం సోదరుడు చెరువుని ఆక్రమించి ఇల్లు నిర్మించినా పట్టించుకోలేదని.. కానీ పేదల బస్తీలకు వెళ్లి.. వారి ఇళ్లు కూలగొడతుందని కేటీఆర్ విమర్శించారు.

Latest News

అందరం కలిసి కట్టుగా పని చేస్తే పార్టీ గెలుస్తుందని తెలిపారు

అలానే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో సర్వేలు నిర్వహించామని.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి చాలా బాగున్నట్లని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనకబడి ఉన్నామని.. అందరం కలిసి కట్టుగా పని చేస్తే పార్టీ గెలుస్తుందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులంతా కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం శ్రమించాలి అన్నారు. అలానే ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను తొలగించి.. లేని వారి పేర్లు చేర్చాలన్నారు.

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో సత్తా చాటాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం మాగంటి సునీత మాట్లాడుతూ.. తన భర్త మాగంటి గోపీనాథ్‌లాగే.. తనకు కూడా కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mahipal-reddy-mla-mahipal-reddy-inaugurates-water-reservoir/telangana/544581/

Breaking News BRS party strategy Jubilee Hills by election KTR announcement latest news Maganti Gopinath Death Maganti Sunitha BRS candidate Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.