हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Telugu News: Jubilee Hills By Election : మాగంటి సునీత నామినేషన్ రిజెక్ట్ BRS కి కొత్త తల నోపి ?

Sushmitha
Telugu News: Jubilee Hills By Election : మాగంటి సునీత నామినేషన్ రిజెక్ట్ BRS కి  కొత్త తల నోపి ?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత విషయంలో ఒక బిగ్‌ట్విస్ట్ చోటు చేసుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక కుమారుడిని తానేనంటూ ఆయన మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారికి (CEO) ఫిర్యాదు చేశారు. సునీత గోపినాథ్ భార్యే కాదని, అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని తారక్ ప్రద్యుమ్న ఆరోపించారు.

Read also: AP: హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు: నారా లోకేష్

Jubilee Hills By Election

చట్టబద్ధమైన వివాదం

మాగంటి గోపినాథ్‌కు 1998 ఏప్రిల్ 29న కోసరాజు మాలిని దేవితో వివాహమైందని తారక్ ప్రద్యుమ్న వివరించారు. గోపీనాథ్ తన తల్లి మాలినీ దేవికి విడాకులు ఇవ్వలేదని, ఆమె ఇప్పటికీ చట్టబద్ధమైన భార్యనేనని స్పష్టం చేశారు. అలాంటప్పుడు సునీత భార్య ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. సునీత, తన తండ్రితో కేవలం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఈ విషయాన్ని దాచిపెట్టి, తనను తాను చట్టబద్ధమైన భార్యగా, తన పిల్లలను చట్టబద్ధమైన వారసులుగా తప్పుగా చూపించారని తారక్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే గోపీనాథ్ మొదటి పెళ్లి వివరాలను దాచారని కూడా పేర్కొన్నారు.

తారక్ డిమాండ్లు, బీఆర్‌ఎస్ ముందస్తు చర్య

తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గానూ సునీత అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సునీత తన అనుచరులతో తమను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు. మరోవైపు, ఈ వివాదం నేపథ్యంలో మాగంటి సునీత షేక్‌పేట్ ఆర్వో కార్యాలయంలో అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారం సరైందేనని మరో డిక్లరేషన్‌ను సమర్పించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నాయకత్వం చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు, ముందు జాగ్రత్తగా విష్ణువర్థన్ రెడ్డితో మరో నామినేషన్ కూడా వేయించింది. ఇప్పటికే సునీత నామినేషన్‌కు ఈసీ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

మాగంటి సునీతపై ఎవరు ఫిర్యాదు చేశారు?

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకు తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు.

సునీతపై ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటి?

గోపినాథ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండి, చట్టబద్ధమైన భార్యగా తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870