హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.
Read Also: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత
అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదు వివరాలు
కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, అందుకే వారు డబ్బులు పంచుతున్నా చూసీచూడనట్లు ఉంటున్నారని హరీశ్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు ఆలస్యంగా రావడం, ఇన్‌ఫర్మేషన్ లీక్ చేసి చీరలు పంచే వారిని అలర్ట్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన వీడియోలు, ఫోటోల ఆధారాలను బీఆర్‌ఎస్ నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు అందజేశారు. ఎన్నికల అధికారులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు హరీశ్ రావు మీడియాకు తెలిపారు.
ప్రధాన ఉల్లంఘన ప్రాంతాలు: ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. సి-విజిల్ యాప్‌లో కూడా కంప్లైంట్ చేశామని ఆయన చెప్పారు.
ఫేక్ ఓటర్ ఐడీలు, కార్యాలయం మార్పుపై డిమాండ్
కాంగ్రెస్ పార్టీ కుప్పలు కుప్పలుగా ఫేక్ ఓటర్ ఐడీలు కూడా తయారు చేస్తోందని ఆయన ఆరోపించారు. యూసఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకుని పోలింగ్ బూత్ ఉందన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయం ఉండకూడదనే నిబంధనను ఎన్నికల అధికారులు మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే పోలింగ్ బూత్ లేదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అక్కడ నుంచి మార్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఓటమి భయంతోనే ఈరోజు ఆరు గ్యారెంటీలపై రివ్యూ మీటింగ్ పెట్టారని, ఆరు గ్యారెంటీలపై రెండేళ్లుగా ఎందుకు రివ్యూ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఉపఎన్నికతో రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: