📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్

Author Icon By Sudheer
Updated: November 11, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నికల హడావుడి ముగిసి ఓటర్ల తీర్పు యంత్రాల్లో బందీ అయింది. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు ప్రకటించకముందే ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు రాజకీయ ఉత్కంఠను రెట్టింపు చేశాయి. అక్టోబర్‌ 13 నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోరు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీల మధ్య తీవ్రమైన హోరాహోరీగా సాగింది. పార్టీలు ప్రతీ బూత్‌, ప్రతీ ఓటును తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారనే ప్రశ్నకు ఎగ్జిట్‌ పోల్స్‌ సమాధానం ఇస్తున్నాయి.

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సర్వే సంస్థల ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కే ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాణక్య స్ట్రాటజీస్‌ ప్రకారం కాంగ్రెస్‌కి 46%, బీఆర్ఎస్‌కి 43%, బీజేపీకి 6% ఓట్లు లభించనున్నట్లు తేలింది. పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో కూడా కాంగ్రెస్‌ 48% ఓట్లతో ముందంజలో ఉండగా, బీఆర్ఎస్‌ 41%, బీజేపీ 6% వద్ద నిలిచాయి. నాగన్న సర్వేలో కాంగ్రెస్‌ 47%, బీఆర్ఎస్‌ 41%, బీజేపీ 8% ఓట్లు పొందనుందని తేలింది. ఆపరేషన్‌ చాణక్య సర్వే మాత్రం కాంగ్రెస్‌ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని అంచనా వేసింది. మరోవైపు JANMINE సర్వేలో కాంగ్రెస్‌కి 42.5%, బీఆర్ఎస్‌కి 41.5%, బీజేపీకి 11.5% ఓట్లు వస్తాయని తెలిపింది.

అదే విధంగా HMR, స్మార్ట్‌పోల్‌ సర్వేలు కూడా కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. అంటే అన్ని ప్రధాన సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉండగా, బీఆర్ఎస్‌ కాస్త వెనుకబడినట్లు తెలుస్తోంది. బీజేపీ మాత్రం రెండు అంకెలను దాటే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో చివరి దశలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కి వచ్చిన సానుకూలత, బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు ఎదురైన యాంటీ ఇన్‌కంబెన్సీ ప్రభావం ఈ ఫలితాలపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎంతవరకు వాస్తవం అవుతాయో తెలుసుకోవాలంటే ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు రోజుకే అందరి దృష్టి సారించింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

brs congress Google News in Telugu Jubilee Hills by election Jubilee Hills By Election Exit Poll Jubilee Hills By Election Exit Poll results Jubilee Hills By polls Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.