జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల (Jubilee Hills by-election) షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తేదీన పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాలలోని మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీఐ కమిషన్ బృందం భేటీ
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన మాగంటి గోపీనాథ్.. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 8న కన్నుమూశారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాగంటి విజయం (Maganti Gopinath) సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన గులాబీ గూటికి చేరారు. 2018లో కారు గుర్తుపై పోటీ చేసిన ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
ఈ నెల 13న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన ఈ నెల 22న చేపట్టనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 24. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తెలంగాణతో పాటు జమ్ము కశ్మీర్, ఒడిశా, ఝార్ఖండ్, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు, ఫలితాలు ఒకే రోజు వెలువడనున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: