తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర హైకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఉన్న జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నిర్ణయంతో తాత్కాలికంగా తెరపడింది.
Read Also: Harish Rao Inspects Siddipet: దరఖాస్తులు పెండింగ్లో పెట్టొద్దు: హరీష్ రావు
ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిటిషన్
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ లో , జీఓ 252, సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరణ ఇస్తూ, జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓ 252, సవరించిన జీఓ 103పై లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం పూర్తి స్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని పేర్కొంది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: