📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu News: John Wesley: ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

Author Icon By Sushmitha
Updated: December 15, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని మైనారిటీ గురుకులంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో బాధితులైన విద్యార్థులను సీపీఎం తెలంగాణ (Telangana) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) ఆదివారం కింగ్ కోఠి ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో పదే పదే జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ కమిషన్ను నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు, అలాగే చికిత్స పొందుతున్న విద్యార్థినులతో, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.

Read Also: TG Panchayat Elections: ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

John Wesley A commission of inquiry should be formed into food poisoning

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సీపీఎం ఆందోళన

హైదరాబాద్, బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల బాలికల హాస్టల్‌లో నవంబర్ 12న కలుషితమైన పెరుగు, కుళ్ళిన కూరగాయల ఆహారం తిని 26 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురై కింగ్ కోఠి, నీలోఫర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బయటకు రాకుండా ప్రిన్సిపాల్ ప్రయత్నించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని జాన్ వెస్లీ మండిపడ్డారు. ఈ ఘటనపై సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆందోళనను వెలిబుచ్చుతుందని ఆయన తెలిపారు.

పునరావృత్తాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలు అవసరం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని జాన్ వెస్లీ స్పష్టం చేశారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి కూడా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

26 students affected Bag Lingampally hostel CPM Telangana Secretary food poisoning victims Google News in Telugu inquiry commission demand John Wesley King Kothi Hospital Latest News in Telugu Minority Gurukulam Niloufer Hospital. November 12 incident Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.