📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Job Notifications: ఈ నెలలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు

Author Icon By Sharanya
Updated: April 17, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఖాళీ పోస్టులన్నింటినీ గుర్తించి, భారీగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది రాష్ట్ర యువతకు భారీ ఊరటనిచ్చే ప్రక్రియగా మారనుంది.

56,740 ఖాళీలు – ఉద్యోగావకాశాలు

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 56,740 పైగా ఖాళీగా ఉన్న పోస్టుల జాబితా అధికారికంగా సిద్ధం అయింది. ఇందులో- శాఖల వారీగా శాఖల వారీగా ఖాళీల భర్తీ పై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్‌ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, మరో 2,150 డాక్టర్‌ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. వైద్యారోగ్య శాఖలో సుమారు 6వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు శాఖల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో కలిపి దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీలో 185-200 వరకు పోస్టులు, మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్‌లు, 7,837 హెల్పర్‌లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

ప్రతి శాఖలో ఖాళీల గణాంకాలు –

గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారి నుంచిదాదాపు 6వేల మంది వీఆర్వోలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించన్నారు. మిగిలిన 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయనున్నారు. పోలీసు శాఖ 12,150, వైద్యశాఖ 2,762, ఆర్టీసీ 3,038, గురుకులాలు 2,850, ఇంజనీరింగ్‌ 2,510, వ్యవసాయ శాఖ 148, ఆర్‌అండ్‌బీ 185, రెవెన్యూ 10,954, మహిళా శిశుసంక్షేమం 14,236 మొత్తం మీద అన్ని విభాగాల్లో కలిపి 18,236 పోస్టులకు తొలి విడత నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

నోటిఫికేషన్ విడుదల తేదీలు

ప్రస్తుతం సమాచారం ప్రకారం, ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు మొదటి విడత నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రతి శాఖకు సంబంధించి ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ అవుతాయి. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల కోసం TGPSC  ద్వారా ప్రక్రియ జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఇప్పటికే రూపొందించబడి, కేంద్రం నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి క్యాలెండర్‌ను సమన్వయంతో రూపొందించారు. గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లభించకపోవడంతో నోటిఫికేషన్లు ఆగిపోయాయి. అయితే, ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తి కావటంతో ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా ప్రభుత్వ హామీలను నిలబెట్టుకునే దిశగా మంచి పిలుపుగా మారింది.

Read also: Metro Charges : హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు !

#GovtJobsTelangana #JobNotifications #RevanthReddy #TelanganaJobs #telengana #TGPSC2024 Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.