Jeevan Reddy: జగిత్యాలలో పొలిటికల్ హీట్.. హస్తం వదిలి కారెక్కనున్న జీవన్ రెడ్డి?

Read Time:  1 min
Jeevan Reddy
Jeevan Reddy
FONT SIZE
GET APP

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుమారు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న ఆయన, త్వరలోనే బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల నియోజకవర్గంలో పట్టున్న నాయకుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక చక్రం తిప్పిన జీవన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని గులాబీ పార్టీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

Read Also:Rythu Bharosa New Applications: రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోండి

Jeevan Reddy
Jeevan Reddy: Political Heat in Jagtial—Is Jeevan Reddy Set to Quit the Congress and Join the TRS?

42 ఏళ్ల అనుబంధానికి స్వస్తి

జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 1983లో టీడీపీతో ప్రారంభమైంది. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన, 1984లో కాంగ్రెస్‌లో చేరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ హయాంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, పార్టీ ఆయనకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రాజకీయంగా అండగా నిలిచింది.

గులాబీ పార్టీలో కీలక పదవికి రంగం సిద్ధం!

అయితే, గత కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేత) కు పార్టీలో ప్రాధాన్యత పెరగడం జీవన్ రెడ్డిని అసంతృప్తికి గురిచేసింది. జెండా మోసిన తనను కాదని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి నియోజకవర్గ పగ్గాలు అప్పగించడంపై ఆయన అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. తన ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని భావించిన ఆయన, ఈ నెల 26న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఆయనకు పార్టీలో సెక్రటరీ జనరల్ పదవిని కట్టబెట్టే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.

జీవన్ రెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల పాటు అన్ని పదవులు అనుభవించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడటం ద్రోహం చేయడమేనని కేడర్ మండిపడుతోంది. ఓడిపోయిన ప్రతిసారీ పార్టీ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, కేవలం ప్రాధాన్యత తగ్గందనే నెపంతో ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడం సరికాదని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఒక సీనియర్ నేత అధికార పార్టీని వీడటం అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.