📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Jeevan Reddy: మార్చి 25న బిఆర్ఎస్‌లో చేరిక?

Author Icon By Pooja
Updated: March 21, 2026 • 3:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైంది. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వీడుతున్న విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also:Karimnagar SI Suicide: భార్య మరణించిన ఐదో రోజే.. ఎస్సై ఆత్మహత్య: అసలేం జరిగిందంటే?

Jeevan Reddy: అసంతృప్తికి కారణం అదేనా?

జగిత్యాల రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలే జీవన్ రెడ్డి నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తన సీనియారిటీకి తగిన గౌరవం దక్కడం లేదని, తనను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సంజయ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు జీవన్ రెడ్డి ఆగ్రహాన్ని మరింత పెంచాయి.

జీవన్ రెడ్డి కోసం అటు బిజెపి (BJP), ఇటు బిఆర్ఎస్ (BRS) గట్టి ప్రయత్నాలే చేశాయి. బిజెపి నేతలు ఆయనకు భారీ ఆఫర్లు ఇచ్చినప్పటికీ, ఆయన మొగ్గు బిఆర్ఎస్ వైపు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్‌తో జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారని, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ఆయనకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ ఇటీవల ఆయన నిర్వహించిన ర్యాలీ కూడా ఈ మార్పుకు సంకేతంగా నిలిచింది.

Jeevan Reddy: మార్చి 25న రాజీనామా.. జగిత్యాలలో భారీ సభ

విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. అదే రోజు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగింపులు కొనసాగిస్తున్నప్పటికీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jagtial MLA Sanjay Kumar vs Jeevan Reddy Jeevan Reddy joining BRS date Jeevan Reddy leaves Congress latest Jeevan Reddy resigns from Congress Telangana Congress internal crisis 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.