📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CM Revanth : సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికిన జపాన్ మేయర్

Author Icon By Sudheer
Updated: April 20, 2025 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు కలిసి ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంగా జపాన్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు కితాక్యూషూ నగరాన్ని సందర్శించారు. అక్కడి మేయర్ కజుహిసా టకేచీ నేతృత్వంలో జపనీస్ సంప్రదాయ పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించారు.

కితాక్యూషూ మేయర్‌తో సీఎం రేవంత్ భేటీ

కితాక్యూషూ మేయర్‌తో జరిగిన సమావేశంలో అభివృద్ధి, పరిశ్రమలు, పర్యావరణ సాంకేతికతలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా నగరాభివృద్ధి, మునిసిపల్ పాలనలో జపాన్ అనుసరిస్తున్న శైలులు, శుభ్రతా ప్రమాణాలపై తెలంగాణ ప్రతినిధులు ఆసక్తిగా చర్చించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి జపాన్ సంస్థలు సహకరించాలని మేయర్‌ను కోరారు. మ్యూచువల్ సహకారంతో రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలపై చర్చించారని సమాచారం.

అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు అవకాశం

ఈ పర్యటనతో తెలంగాణకు సంబంధించి అంతర్జాతీయ పెట్టుబడుల రాకకు అవకాశం ఏర్పడనుందని, తెలంగాణ రైజింగ్ నినాదం క్రింద రాష్ట్రానికి సాంకేతిక, పారిశ్రామిక, మునిసిపల్ అభివృద్ధిలో మంచి మార్గదర్శకత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. జపాన్ టూర్ లో భాగంగా ప్రతినిధి బృందం ఇతర ప్రముఖ నగరాలు, పరిశ్రమల ను కూడా సందర్శించి, అనుభవాలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించనుంది.

cm revanth Google News in Telugu japan Japanese Mayor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.