తెలంగాణలో బనకచర్ల జలవివాదం (Banakacherla water ) వేడెక్కుతున్న నేపథ్యంలో, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా బాలానగర్ మండలం మోతీ ఘనపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, “ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో కోవర్ట్‌లు ఉన్నారు. రాష్ట్రంలోని కొంతమంది చంద్రబాబు పక్షంగా పనిచేస్తున్నారు. వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు ఏపీకి అనుకూలంగా మలుస్తున్నారు” అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
కోవర్ట్‌లపై చర్యలు తీసుకోవాలి – ప్రభుత్వానికి సూచన
అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) వ్యాఖ్యల ప్రకారం, ఈ కోవర్ట్‌ల ద్వారా చంద్రబాబు బనకచర్ల రెగ్యులేటర్ వద్ద నీటి పంపకాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “ఈ కోవర్ట్‌లకు కరెంట్, నీటి కనెక్షన్లు కట్ చేయండి. ఒక్క రూపాయి నిధి కూడా ఇవ్వకండి. వాళ్లే చంద్రబాబుని కలిసి బనకచర్ల బంద్ చేయించమంటారు” అని తెలిపారు. కేంద్రానికి లేఖలు రాసే దానికన్నా, ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్న వారి చుట్టూ బిగుసరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం.. అనిరుధ్ వ్యాఖ్యలపై చర్చ
ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రధాన జలసంక్షోభంగా మారిన తరుణంలో అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాజకీయంగా ప్రభావాన్ని చూపే అవకాశముంది. గతంలోనూ అనిరుధ్ తనదైన శైలిలో సొంత పార్టీని, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలున్నాయి. తిరుమలలో ఎమ్మెల్యే సిఫార్సులపై అభ్యంతరం, మంత్రి స్థాయి నేతలపై అసహనం వంటి వ్యాఖ్యలు ఆయనను వార్తల పేగులో ఉంచుతున్నాయి. ఈసారి ఆయన ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో ఉత్కంఠగా మారింది.
Read Also : Harish Rao : కేసీఆర్ వాటర్ మ్యాన్ .. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ – హరీశ్‌రావు