యాక్సిడెంట్ ఏమోగానీ.. గుడ్లు మాత్రం ఫ్రీ.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..తో(Janagama) వెళ్తున్న వ్యాన్ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిన ఘటన స్థానికంగా పెద్ద హల్‌చల్‌కు దారితీసింది. బుధవారం జనగామ–సూర్యాపేట జాతీయ రహదారిపై(National Highway) మాన్సింగ్ తండా సమీపంలో ఈ ఘటన జరిగింది. డీసీఎం వాహనం ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో అందులో ఉన్న కోడిగుడ్ల ట్రేలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని గుడ్లు కిందపడగానే పగిలిపోగా, మరికొన్ని మాత్రం ట్రేల్లో అలాగే ఉండిపోయాయి.
Read also: వ్యవసాయోత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ లక్ష్యం
గుంపును నియంత్రించిన పోలీసులు
ఇప్పటికే మార్కెట్లో కోడిగుడ్ల (Janagama) ధరలు పెరిగిన నేపథ్యంలో, రోడ్డుమీద పెద్దఎత్తున గుడ్లు పడి కనిపించడంతో ప్రయాణికులు, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. కొందరు గుడ్లను ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. ఆ సమయంలో డీసీఎం యజమాని, వాహన సిబ్బంది కూడా అక్కడికి వచ్చి పాడుబడని గుడ్లను మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేశారు. వ్యాన్ డ్రైవర్ ప్రకారం ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించాలనే ప్రయత్నంలో డీసీఎం ఒక్కసారిగా వాలు తీసుకోవడంతో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: