📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jagtial Crime: భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Author Icon By Saritha
Updated: March 17, 2026 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Jagtial Crime Husband Pours Petrol on Wife and Sets Her Ablaze

Jagtial Crime: జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్నోడే కాలయముడై భార్య పై హత్యాయత్నానికి పాల్పడిన హృదయవిదారక ఉదంతం ధర్మపురిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ధర్మపురికి చెందిన నవీన్ రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళు వీరి కాపురం సవ్యంగానే సాగింది. కొన్నాళ్లుగా భార్య రమ్య పై భర్త నవీన్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన గొడవ కారణంగా ప్రస్తుతం ఆమె భర్తను వదిలేసి తల్లి ఇంటి వద్దనే ఉంటుంది. నవీన్ సోమవారం రాత్రి భార్య ఇంటికి వెళ్లి రమ్యని బయటకు పిలిచాడు.

Read Also: Siddipet Road Obstruction: మూడు రోజులుగా రోడ్డు పైనే జనరేటర్

అనుమానంతో దాడి

రమ్య బయటికి రాగానే భర్త తన వద్ద ఉన్న పెట్రోలు రమ్య పై పోసి నిప్పంటించాడు. ఆమె తల్లిదండ్రులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని పక్కకు నెట్టివేశాడు. మంటలు అంటుకొని ఆర్తనాదాలు చేస్తున్న రమ్యను తల్లిదండ్రులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె ఒళ్లంతా కాలిపోయింది. చివరకి మంటలను ఆర్పేసి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన రమ్య చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు సమాచారం. కాగా నవీన్ ధర్మపురి మున్సిపాలిటీలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. తమ కూతురికి నిప్పంటించి హత్యాయత్నం చేసిన నవీన్ ను కఠినంగా శిక్షించాలని రమ్య తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dharmapuri Crime Dharmapuri Municipal staff Naveen Husband sets wife on fire jagtial

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.