తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) ఇటీవల సంస్థాగత విభాగాల్లో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలపరచడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (Jagruti Teachers Federation) నూతన కార్యవర్గాన్ని ఆమె ప్రకటించారు. ఈ వివరాలను జాగృతి అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
Read Also: Vikarabad Crime: కుటుంబ సభ్యులను హత్య చేసి వ్యక్తి ఆత్మహత్య
తెలంగాణ సమాజాభివృద్ధి, విద్యా ప్రగతి, సాంస్కృతిక చైతన్యం కోసం జాగృతి సంస్థ నిరంతరం కృషి చేస్తోందని కవిత పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, అందుకే ఈ విభాగం బలపడటం ఎంతో అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి
నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావును, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేష్ గౌడ్‌ను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని కవిత స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన బాధ్యులు విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు ఫెడరేషన్ చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: