📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Jaggareddy: మా అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో: జగ్గారెడ్డి

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తీవ్ర విమర్శలు చేశారు. తమ సుదీర్ఘ రాజకీయ అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో అని, ఆయన ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CMReventh Reddy)ని చర్చకు పిలిచే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మంగళవారం నాడు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించారు. “మేమంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఎదిగాం. కేటీఆర్ తన తండ్రి సీటిస్తే నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయనెప్పుడైనా సర్పంచ్‌గా గెలిచారా? జడ్పీటీసీగా గెలిచారా? రాజకీయాల్లోని కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఆయనకు ఎలా తెలుస్తాయి?” అని జగ్గారెడ్డి నిలదీశారు.

Jaggareddy: మా అనుభవం ముందు కేటీఆర్ ఒక జీరో : జగ్గారెడ్డి

ఆయన తీవ్ర ఒత్తిడిలో వున్నారు

కేటీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, కాంగ్రెస్ నేతలను “గాడిదలు” అంటూ విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. “మీరు మమ్మల్ని ఒక మాట అంటే మేము పది మాటలు అంటాం. మీరు ముఖ్యమంత్రిని దూషించడం ఆపేస్తే, మేము కూడా ప్రతి విమర్శలు ఆపేస్తాం” అని స్పష్టం చేశారు. 18 నెలలు అధికారం లేకపోయేసరికి కేటీఆర్ గట్టున పడ్డ చేపలా కొట్టుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. సోదరి కవిత అరెస్టు వ్యవహారంతో ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా అధ్యయనం చేయాలని సూచించారు .

జగ్గారెడ్డి రాజకీయ చరిత్ర ఏమిటి?
రాజకీయ జీవితం

ఆయన బిజెపిలో కౌన్సిలర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2004లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో తిరిగి ఎన్నికయ్యారు, కానీ 2014లో ఓడిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ

#telugu News Congress vs BRS Jaggareddy comments on KTR Jaggareddy news Jaggareddy vs KTR KTR criticism KTR political experience Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.