Jaggareddy: మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ కు హెచ్చరిక

Read Time:  1 min
Jaggareddy
Jaggareddy
FONT SIZE
GET APP

తెలంగాణలో (TG) త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Jaggareddy) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు కూడా రెబల్స్ బెడద తప్పడం లేదు. ఈ క్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు. తనను, పార్టీ నిర్ణయాన్ని కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే వారిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Read Also: Telangana Municipal Elections: మున్సిపోల్స్ లో రెబెల్స్ బెడద

Jaggareddy
A warning to Congress party rebels in the municipalities

సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వార్డుల్లో రెబల్స్ పోరు ఉంది. అయితే పార్టీ అధిష్ఠానం ఇప్పటికే అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసింది. పోటీకి ఆసక్తి చూపుతున్న మిగిలిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుని పార్టీ బీ-ఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు సహకరించాలని జగ్గారెడ్డి (Jaggareddy) సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.