📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Revanth : సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్ రెడ్డి ఫైర్

Author Icon By Sudheer
Updated: May 1, 2025 • 7:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి పేరు ఎత్తినా, ఎత్తకపోయినా కేసీఆర్‌కు భయపడుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ ఒక్క మంచి పని చేయలేదని, అలాంటి వ్యక్తిని ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారన్నారు. ప్రజల కష్టాలు పెంచిన వ్యక్తిగా మాత్రమే రేవంత్ గుర్తింపు పొందుతున్నాడంటూ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే అన్న దురభిప్రాయం

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే అన్న దురభిప్రాయంతో ఆయన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పదవిరాగానే సోనియా గాంధీని విమర్శించిన రేవంత్, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారతాడని ఆరోపించారు. కేసీఆర్‌ పట్ల చిల్లర విమర్శలు చేయకుండా రేవంత్ తన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ముప్పు అని, కేసీఆర్ గతంలో చెప్పినది సత్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడం

రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, తన పదవి ఎంతకాలం కొనసాగుతుందో ఆయకే తెలియదని జగదీశ్ రెడ్డి చురకలేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడంతో విమర్శలు చేస్తూ దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లో ఉంటే భయమెందుకు అనడమే కాదు, పదేళ్లు అధికారం చేసిన బీఆర్ఎస్‌ను విమర్శించడం వాస్తవాలను మరచినట్టు కాదన్నారు. ప్రజలకు అవసరమైన పాలనపై దృష్టి పెట్టాలని, రాజకీయ విమర్శలు మానుకోవాలని జగదీశ్ రెడ్డి సూచించారు.

Read Also : Pahalgam Terror Attack : ఇది ప్రతి ఒక్క భారతీయుడిపై చేసిన దాడి – సోనూ సూద్

brs cm revanth congress Google News in Telugu jagadeesh reddy KCR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.