📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

సుకుమార్‌పై ఐటీ కొరడా

Author Icon By Vanipushpa
Updated: January 22, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్‌లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్‌లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం.

రెండోరోజు కూడా హైదరాబాద్‌‌లో దిల్ రాజుపై పలుచోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తోన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత దిల్ రాజునే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2ను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు సుకుమార్ 15 కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

Dil Raju sukumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.